నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Tuesday, April 20, 2010

టేకుమళ్ళ ప్రీతం స్కూలు వార్షికోత్సవం సంబరాలు.






తే! గీ! వివిధ రంగము లందున వీరులమ్ము!
ఎవరు జాలరు మాముందు ఎప్పుడయిన!
కళల చదువుల యన్నిట కకుదమేను!
గొప్ప మాటలు చెప్పము గొంచెమయిన!
(కకుదం అనగా పర్వత శిఖరం అని అర్ధము)

టేకుమళ్ళ వారు గాన, నాటక, నృత్య, కవిత్వ రంగాలలో రాణిస్తున్నారు అనేదానికి మన వద్ద 18 వ శతాబ్దం నుండి అనేక తార్కాణాలు ఉన్నాయి. మళ్ళీ మన తరం లో ఇంకో నటుడు పుట్టాడు. ఎవరా? అని అలోచిస్తున్నారా? వాడే మన ప్రసాద్ కొడుకు చి.ప్రీతం. చిరంజీవి నాట్య విన్యాసలు చూడండి. మనస్ఫూర్తిగ ఆశీస్సులు అందజేయండి.

టేకుమళ్ళ ప్రీతం కు 10 వ జన్మ దిన శుభాకాంక్షలు.





ఏప్రిల్ 13వ తేదీ, టేకుమళ్ళ ప్రసాద్ గారి కుమారుడు చి.ప్రీతం జన్మదినం, మియాపూర్ లో గల వారి స్వగృహం లో వైభవోపేతం గా జరిగింది. హాజరైన వారిలో, టేకుమళ్ళ శ్రీనివాస్ చక్రవర్తి కుటుంబ సభ్యులు, శ్రీమతి బిందు, ఫ్రదోష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే, ప్రీతం నాయనమ్మ లలితాంబ గారు హాజరయ్యారు. బర్తు డే కేకు కట్ చేసిన అనంతరం, అందరు పెద్దలూ, తమ అసీస్సులను అందజేసారు. పిన్నలూ, పెద్దలూ ఈ సందర్భంగా కలుసుకొని, ఆ నాటి సాయంత్రం, ఆనందంగా గడిపారు.

Tuesday, April 13, 2010

అరసికులకు కవిత్వము చెప్పమని అడగొద్దు దేవుడా!!!

శ్లోll
ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన!
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !
కll

చతురాస్యుఁడ! నా నుదురున
అతులిత దుష్కర్మవ్రాయి! హాయిగ వలతున్!
స్తుతియింపగ నరసికుల
మతిమాలియు వ్రాయఁబోకు. మరువకుమయ్యా!
భావము:-
ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా వ్రాయుము. సహిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం వ్రాయకుసుమా! . ముమ్మాటికీ వ్రాయకు.

Friday, April 2, 2010

సుజనరంజని ఈ మాగజైను.

సుజనరంజని చాల మంచి ఈ మాగజైను.
చదవండి.

అన్నట్టు ఈ మాసపు మాగజైను లో నా సమస్యాపూరణ పడింది. చూడండి.
టి.వెంకటప్పయ్య, సికిందరాబాద్

తే!గీ!!ఘోష యాత్ర నందు ఘోరావమానమై
తపము జేసి పొందె తాను వరము
కుంతి సుతులనెల్ల కుహకంబు జేసెగా!
మనిషి చచ్చె కాని మదము మిగిలె!
(కుహకము అనగా మోసము అని అర్ధము)
link: http://siliconandhra.org/nextgen/sujanaranjani/apr10/padyamhrudyam.html