నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Friday, July 22, 2011

శ్రీ రావిప్రోలు సత్యనారాయణ, శ్రీమతి లీలావతి గార్ల 50 వ వివాహ వార్షికోత్సవం



సంఘములో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది. భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గానజాలము. మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి. లాంటి తరుణం లో....ఒక జంట.. ఒక దంపతులు.. 50 సంవత్సరాల వైవాహిక జీవితం గడపి స్వర్ణొత్సవం చేసుకుంటున్నారంటే...ఆనందం అవధులు లేవు. అందునా మీదు మిక్కిలి.. ఆ జంట నాకు స్వయానా.. సోదరీ మణీ..లీలావతీ, మరియూ బావ సత్యనారాయణ కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది.


నూటికో..వెయ్యికో.. ఒక జంటకు మాత్రమే..జరిగే ఈ ఆనంద హేల.. మన కుటుంబ సభ్యులకు జరగడం మీదు మిక్కిలి హృద్యంగమం. మహాత్మా గాంధీజీని ఒక సారి ఎవరో మీ సందేశం ఎమిటి? అని అడిగితే.. ఆయన నవ్వేసి.. నా జీవితమే.. నా సందేశం అన్నాట్ట. అలాగే.. వీరి ఆదర్శ జీవితమే.. మనకు గొప్ప సందేశం..


(చిత్రం పైన క్లిక్ చేసి పెద్దది గా చూడవచ్చు)

పైన ఉన్న శుభ లేఖ నా చిన్న తనంలో.. మినగల్లు లో దొరికిన దాన్ని.. భద్ర పరచి.. మీ ముందు ఉంచాను.. బ్ర.వే..రావిప్రోలు సత్యనారాయణ, లీలావతి గార్ల కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రు..ఇంకా ముది మనుమలూ.. ఇంకా కొన్ని తరాల వారు .. ఆనందంతో.. వీక్షిస్తారని భావిస్తున్నాను.
తిధుల ప్రకారం శ్రావణ శుద్ధ పంచమి ఈ 50 వ వార్షికోత్సవం ఆగస్ట్ నెల 4వ తేదీ ,2011 న వచ్చింది. ఆ రోజున ముంబాయి లోని "వాషి" లోగల బాలాజీ, సత్య సాయి బాబా దేవాలయములో ఉదయము 8 గంటలనుండి..12.30 గణపతి, ఆయుష్ హోమాలూ, పూజలూ జరగనున్నాయి. మధ్యాన్నం 1 గంట కు భోజనం.



ఆరోజున కారణాంతరాల వల్ల ముంబాయి రాలేని వారికీ...హైదరాబాదు నివాసులకూ..మిగతా బంధు వర్గానికీ..ఆగస్ట్ నెల 13వ తేదీ గాంధీనగరు లోని వారి స్వగృహం లో "సత్య నారాయణ వ్రతము" జరుగును. అందరూ విచ్చేసి ఆనందించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించవచ్చు.అలాగే..ఆగస్ట్ నెల 14 వ తేదీ 2011 రాత్రి 7 గంటలకు, "మోక్ష హోటెల్" (నెక్లెసు రోడ్డు) లో విందు కార్యక్రమము నిర్వహిస్తున్నారు.
బంధు వర్గం మరియూ స్నేహిత బృందమూ.. వారి వారి అనుకూలనుసారం.. ముంబయి లేక హైదరాబాదులో హాజరై పెద్దలు తమ ఆశీస్సులను అందజేయండి. పిల్లలు ఆ పుణ్య దంపతుల అశీర్వచనం తీసుకోండి.



ఇదే అమెరికా దేశం లో ఐతే..ఆ దేశ ప్రెసిడెంటు 50 వ వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే జంటలకు స్వయంగా శుభాకాంక్షలు అందజేయడం జరుగుతుంది. మరి మన దేశం లో "శుభాకాంక్షలు" మాట అటుంచి "ఆంక్షలు" విధించ కుండా ఉంటే చాలు అనుకుంటాము.


25 వ సంవత్సరం "సిల్వర్", 30 వ సంవత్సరం "పెరల్", 40 వ సంవత్సరం "రూబీ" 50 వ సంవత్సరం "గోల్డ్" 60 వ సంవత్సరం "డయమండ్" , 70 వ సంవత్సరం "ప్లాటినం" ఇలా జరుపుకోవడం ఆనవాయితీ గా ఉంది. ఈ దంపతులు కూడా..60 వ సంవత్సరం "డయమండ్ వార్షికోత్సవం" , 70 వ సంవత్సరం "ప్లాటినం వార్షికోత్సవం" జరుపుకోవాలనీ ఆ తర్వాత వైవాహిక జీవనం "శతాబ్ది వార్షికోత్సవం" జరుపుకోవాలనీ.. మనస్ఫూర్తిగా ఆ "అమ్మల గన్న యమ్మ, ముగ్గురమ్మల వేల్పులటమ్మ" ను ప్రార్ధిస్తూ శెలవు తీసుకుంటున్నాను.
భవదీయుడు..


గమనిక: ముందుగా శుభాకాంక్షలు తెలియ జేయాలనుకునేవారు శ్రీ రావిప్రోలు సత్యనారాయణ గారికి.. 098 199 49 192 కు, శ్రీమతి లీలావతి గారికి 098 694 03 169 కి ఎసెమ్మెస్ ద్వారా లేక ఫోను ద్వారా తెలియ జేయ వచ్చు.

టేకుమళ్ళ వెంకటప్పయ్య.

















































































































































Monday, April 25, 2011

భగవాన్ సత్య సాయి బాబా శివైక్యం.





20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.

సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు. ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.

భగవంతుడు భూమి మీద అవతరించటానికి ఒక స్థలాన్ని,ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఆ స్థలం పుట్టపర్తి. ఆ వ్యక్తి ఈశ్వరమ్మ. అలాగే ఒక నామధేయాన్ని కూడా.ఆ పేరే సత్యసాయిబాబా. భక్తులు ఆర్తిగా పిలుచుకునే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ప్రేమ,శాంతి,దయ,ధర్మం,అహింస భావనలే మానవ జాతికి ముక్తి మార్గమని ఉద్బోదించి,తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్ధకం చేస్తున్న అపర భగవానుడు. ఆయన భోధనలు మానవాళికి మార్గదర్శనాలు. ఆయన తత్వం ప్రేమ తత్వం. ఆయన మార్గం దైవ మార్గం. మన కోసం మన మధ్యే నడయాడుతున్న దైవ స్వరూపం. ప్రపంచమంతా ఒక్కటయ్యే మధుర క్షణం మనందరి కోసం వేచి ఉందని, మనుషులంతా దానికోసం కలిసి కట్టుగా పాటుపడాలనీ ఆయన ఉపదేశించారు.

సాయి బాబా స్వయంగా తానెవరో చెప్పినవి క్రింద వ్రాయబడ్డాయి.

"నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు అసలు తెలియదు".

"మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు. నా మార్గంలో గాని, మరో మార్గంలో గాని శిష్యులను, భక్తులను ఆకర్షించడం నా అభిమతం కాదు.... విశ్వవ్యాప్తమైన, ఏకమైన ఆధ్యాత్మిక సూత్రం - ప్రేమ అనే మార్గం, ధర్మం, బాధ్యత - ఈ ఆత్మ సత్యాన్ని చెప్పడానికే వచ్చాను. ... తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని వీడమనీ ప్రతి మతం ఉద్బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకొని మోక్షాన్ని సాధించుకోవడాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాలలోనూ వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతునే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుని ఆరాధించడానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్య భావాన్ని అవగతం చేసుకోండి". (4 జూలై 1968)

"ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వ భావంతో ఏకం చేయడానికి, ఆత్మ సత్యాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ సాయి వచ్చాడు. మనిషినీ మనిషినీ జోడించే ఈ దివ్య సంప్రదాయమే విశ్వాధారమైన సత్యం. ఇది తెలుసుకొంటే మనిషి పశుత్వం నుండి ఎదిగి దివ్యత్వం సాధించగలడు" (19 జూన్, 1974)

"మీ అందరిలో సాత్విక భావాన్ని పెంపొందించడమే నా లక్ష్యం. నేనేదో మహిమలు చేస్తున్నాననీ, ఇదీ అదీ సృష్టించి ఇస్తున్నాననీ విని ఉంటారు. అది ముఖ్యం కాదు. సత్వ గుణమే ముఖ్యం. మీకు నేను ఆరోగ్యైశ్వర్యాదులను నేను ప్రసాదించేది మీ అవరోధాలను తొలగించి ఆధ్యాత్మ సాధనపై మనసు లగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతోనే". (25 జూలై 1958)

"అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శవంతమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి. కాని ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దు".
అవతరించుట యనుటలో అర్ధమేమి? జనులపై ప్రీతి వాత్సల్యపరత తోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ .

సత్యసాయి బాబా , సత్యనారాయణ రాజుగా, 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో, అనంతపురం జిల్లాలోని, పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతకు అవే మోగాయి అని చెప్పుకుంటారు.

ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రచించిన జీవిత కధ ప్రకారం వ్రతం తరువాత ఈశ్వరమ్మకు ఒక నీలిరంగు గోళం వంటి కాంతి తనలో లీనమౌతున్నట్లుగా కల వచ్చింది. తరువాత ఆమె గర్భవతి అయ్యింది. బిడ్డ జననం తరువాత పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చింది. కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. అయితే ఈ అనుభవాలను గురించి ఆ సమయంలో ఉన్న వ్యక్తులనుండే విభిన్న కధనాలు వినబడుతున్నాయి.

దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాధమిక విద్య సాగింది. చిన్న వయసులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. మార్చి 8, 1940న కొంత విచిత్రమైన ప్రవర్తన (తేలు కుట్టినట్లుగా) కనబరచాడు. ఈ సంఘటన తరువాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు. 1940లో తాను షిరిడీ సాయిబాబా (1838-1918కు చెందిన ఫకీరు) అవతారమని ప్రకటించాడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు.


కస్తూరి వ్రాసిన జీవిత చరిత్ర ప్రకారం అక్టోబర్ 20, 1940లో, తన 14 యేండ్ల వయసు అప్పుడు, తన పుస్తకాలు వదిలేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పాడు. తరువాత మూడేండ్లు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటినుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూలు రికార్డులలో అతని పేరు ఉన్నది.

1944లో అనుచరులు (భక్తులు) ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని "పాత మందిరం" అంటారు. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తిల అవతారమని ప్రకటించాడు అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, విష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు. నారాయణ కస్తూరి వ్రాసిన జీవిత గాధ "సత్యం శివం సుదరం"లో ప్రేమ సాయిబాబా అవతరణ మైసూరు రాష్ట్రంలో జరుగనున్నదని వ్రాయబడింది. షిరిడీ సాయి బాబా భక్తురాలైన శారదాదేవి కధనం ప్రకారం తన మరణకాలంలో షిరిడీ సాయిబాబా ఆమెకు "తాను మరో ఎనిమిది సంవత్సరాలలో 'సత్య' పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో అవతరిస్తాను" అని చెప్పాడు. (సత్యసాయిబాబా పేరు, జన్మదినం, జన్మ స్థలం ఈ కధనానికి సరిపోతాయి.). సత్య సాయిబాబాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న (కీ.శే.శేషమరాజు), ఒక తమ్ముడు (కీ.శే.జానకి రామయ్య) ఉన్నారు. 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తొంటి ఎముకకు గాయమయ్యింది. 2005 నాటికి అతను చక్రాలకుర్చీ వాడుతున్నాడు.

1958లో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారధి అనే అధికారిక పత్రికను ప్రచురిచడం ప్రారంభించారు.1960 నుండి పాశ్చాత్య దేశాలనుండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించడం అధికం అయ్యింది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారత దేశం దాటి బయటకు వెళ్ళాడు. కాని అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.

1960లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు. 1984లో ప్రచురింపబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది."నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను గాని ఈ క్రొత్త శరీరంలో అలా కాను."
సాయిబాబాకు 'గీత' అనే పెంపుడు ఏనుగు ఉండేది. గున్నయేనుగుగా అతనికి బహూకరింపబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచు వాడేవారు. మే 22, 2007లో ఆ ఏనుగు చనిపోయింది. తరువాత 'సత్యగీత' అనే మరో ఏనుగు దాని స్థానంలో ఉంది.శ్వాసకోశ, మూత్రపిండల మరియు ఛాతీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో మార్ఛి 28న చికిత్స నిమిత్తం చేర్చబడ్డారు. దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు సత్యసాయి బాబా ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిఛారు.

సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, ఉదాహరణలతో కూడి ఉంటాయి. తాను సకల దేవతా స్వరూపుడనైన అవతారమని బాబా చెప్పాడు. అంతే గాకుండా అందరిలోనూ దేవుడున్నాడనీ, అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియడంలేదనీ, అదే ముఖ్యమైన తేడా అనీ చెప్పాడు. ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించాడు.

సత్యసాయి బాబా బోధనలు సకల మత సమైక్యతను (syncretism) వెల్డిస్తాయి. కాని అవి అధికంగా హిందూ మతం సంప్రదాయాలను, విశ్వాసాలను ప్రతిబింబిస్తాయని ఒక పండితుని అభిప్రాయం. తాను అందరిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, వేదాధ్యయనాన్ని సంరక్షించడానికీ అవతరించానని చెప్పాడు.


సత్య సాయి బోధనలలో తరచు కనుపించే మరొక ముఖ్యాంశం - తల్లిదండ్రుల పట్ల భక్తి. మాతృమూర్తులే సమాజాన్ని తీర్చి దిద్దుతారని, స్త్రీలను గౌరవించడం జాతీయ కర్తవ్యమని బోధించాడు.


ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భజనలు చేయడం, ఆయన బోధనలను పఠించడం, సమాజ సేవ చేయడం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. కాని వారి సంస్థలు "మిషనరీ" వ్యవస్థను పోలి ఉండవు. వాటిలో భక్తి ముఖ్యమైన అంశం. తన గురించిన పబ్లిసిటీని బాబా ప్రోత్సహించడు. సాయి సత్సంగాలలో అన్ని దేవతల, గురువుల భజనలు సాగుతుంటాయి.


సాయి బోధనలననుసరించి సాయి సంస్థ ఐది మౌలికమైన కర్తవ్యాలను ప్రోత్సహిస్తుంది - అవి సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంత
ఇతర ముఖ్యమైన బోధనలు.

సేవ, దాన ధర్మాలు , సకల ప్రాణులపట్ల ప్రేమ సాధన. వృద్ధాప్యంలో భగవంతుడే సత్యం. మిగిలినది మాయ . శాకాహారం, ధూమపానం, మాదక ద్రవ్యాలనుండి దూరంగా ఉండడం.
సంసారం పట్ల వైరాగ్య భావం, ఇంద్రియ నిగ్రహం.
ధ్యానం - భగవన్నామ, రూప స్మరణం, భక్తి, జపం, సాధన
అన్ని మతాలు భగవంతుని కడకు చేరస్తాయన్న విశ్వాసం
తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల భక్తి
సాయిబాబా బోధనలు ఈ క్రింది నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చునని అంటారు:

ఒకటే కులం - మానవత
ఒకటే మతం - ప్రేమ
ఒకే భాష -హృదయం
ఒకే దేవుడు - అంతటా ఉన్నవాడు.
హజరత్‌ మహమ్మద్‌ 1400 సంవత్సరాల కిందట భగవంతుని దివ్య వాణిని 'ఖుర్‌ ఆన్‌ ' రూపంలో పొందుపరిచాడు.ఇందులోని రెండు పదాలు సలాత్‌ , జకాత్‌ .అంటే ప్రార్థన , దానధర్మాలు .వీటిని ఆచరించే సమాజానికి ఇస్లాం అని పేరుపెట్టారు. ఇస్లాం అంటే శరణు , శాంతి అని అర్థం. ఎవరు భగవంతునికి శరణాగతులై నిరంతర శాంతితో జీవించడానికి పూనుకుంటారో ఆ సమాజమే 'ఇస్లాం'.(ఈనాడు 5.4.2011).

దేశ దేశాలలో సాయి సమితులున్నాయి. సత్యసాయి సమితివారి చిహ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళాలు ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింసలకు చిహ్నాలు. (ఇంతకు ముందు ఈ దళాలపై వివిధ మతాల చిహ్నాలుండేవి)

సత్యసాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు 'సనాతన సారధి' అనే మాస పత్రికతో బాటు 40 భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు. వివిధ దేశాలలో వారి శాఖలున్నాయి. 2001లో "సాయి గ్లోబల్ హార్మొనీ అనే రేడియో స్టేషన్ ప్రాంభమైంది.

సత్య సాయి బాబా మహిమలు, వాటి గురించిన భిన్నాభిప్రాయాలు, విమర్శల గురించి పై భాగంలో కొంత వ్రాయబడింది. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఘటనలు బాబా వ్యక్తిత్వాన్ని గురించి, అతని సంస్థల గురించిన సంచలనాత్మకమైన విమర్శలకు కారణమయ్యాయి. జూన్ 6, 1993న నలుగురు వ్యక్తులు చాకులతో సాయిబాబా గదిలోకి దూరారు. ఇద్దరు అనుచరులను చంపారు. ఆ నలుగురు ఆగంతుకులూ చంపబడ్డారు. ఇది వార్తా పత్రిలలో ప్రముఖంగా వచ్చింది. తన 1993 గురు పూర్ణిమ ఉపన్యాసంలో బాబా 'తన అనుయాయుల మధ్య ఉన్న అసూయ ఈ ఘటనకు కారణం' అని బాబా చెప్పాడు కాని అంతకంటే వ్యాఖ్యానించలేదు. నలుగురు ఆగంతుకులనూ అక్కడే చంపవలసిన అవుసరం ఉందా అన్న విషయంపై కూడా పలు వాదోపవాదాలు జరిగాయి.

ఇంకా ప్రైవేటుగా తనను సందర్శించ వచ్చిన వారి పట్ల సాయిబాబా లైంగిక ప్రవర్తన గురించిన 'ఫిర్యాదులు' కూడా తరచు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పత్రికలలోనూ, టివి ఛానళ్ళలోనూ ఈ విషయమై విమర్శనాత్మకమైన కధనాలు వెలువడ్డాయి. ఈ కధనాల గురించిన స్పందనలు కూడా తీవ్రంగానే వచ్చాయి. సాయి బాబాకు పెద్ద పెద్ద వారి అండదండలుండడం వలన అతనిపై ఫిర్యాదులను సరిగా పరిశోధంచడంలేదనేది విమర్శ. సాయిబాబాకు ఉన్న అసాధారణమైన ప్రతిష్ట వల్లనే లేనిపోని అపవాదులు వస్తున్నాయనీ, ఇవి నిష్పాక్షికమైన పరిశోధనలో నిలబడవనీ స్పందన. సాయి బాబా ప్రచారం కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదనీ, పాశ్చాత్యులు తమకున్న అపోహలతో ఇలాంటి నిందలకు ఒడిగడుతున్నారనీ ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ అన్నాడు అలాగే సాయిబాబాను నమ్ముకొన్న ముగ్గురు వ్యక్తులు వివిధ సందర్భాలలో ఆత్మహత్య చేసుకోవడం పై గురించి కూడా పలు వివాదాలున్నాయి.

సాధారణంగా ఇటువంటి విమర్శలకు సాయిబాబా స్పందించడం జరుగలేదు. కాని 2000లో ఒక ఉపన్యాసంలో 'కొందరు ధన ప్రలోభాలకు లోబడి ఇటువంటి అపనిందలు వేస్తున్నారు' అని చెప్పారు.

విమర్శలకు సమాధానాలు 2001 డిసెంబరులో అటల్ బిహారీ వాజపేయి (అప్పటి ప్రధాన మంత్రి), పి.ఎన్.భగవతి ( సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి), రంగనాధ మిశ్రా (జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి), నజ్మా హెప్తుల్లా (ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్, య.ఎన్.డి.పి. ప్రముఖ మానవ అభివృద్ధి దౌత్యవేత్త), శివరాజ్ పాటిల్ (లోక్ సభ పూర్వ స్పీకర్, కేంద్ర కాబినెట్ మంత్రి) కలసి సంతకం చేసిన అధికారిక లేఖను పబ్లిక్‌గా విడుదల చేశారు. ఇందులో సాయబాబాకు వ్యతిరేకంగా వస్తున్న అపనిందల దాడి "అసంబద్ధం, నిరాధారం, బాధ్యతా రహితం" అని వాటిని ఖండించారు.


బిల్ ఐట్కిన్ అనే సాయి భక్తుడు, ధార్మిక విశ్లేషకుడు, యాత్రికుడు,"Sri Sathya Sai Baba: A life" అనే పుస్తక రచయిత చెప్పిన ప్రకారం బాబా మీద అపనిందలు అధికంగా బాధ్యతా రహితమైనవి, దురుద్దేశ్య పూర్వకమైనవి. పరిశిలనకు నిలవనివి. బి.బి.సి. వంటి ఛానళ్ళు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి కారణం 'చర్చి' వ్యవస్థకు పోటీ నిలవ గలిగే ఉద్యమాల పట్ల వారికున్న అనాదరణా భావమే. బాబాను విమర్శించేవారు ఎక్కువైనప్పుడల్లా బాబాను ఆరాధించే వారు మరింతగా పెరుగుతున్నారు.


ముఖ్యంగా లైంగిక ప్రవర్తన గురించిన బి.బి.సి.లో వచ్చిన నిందలు పూర్తిగా ఆధార రహితమని అశోక్ భగాని వివరించాడు. ఎందుకంటే ప్రైవేటు దర్శన సమయంలో కుటుంబ సభ్యులు గాని, మిత్రులు గాని తప్పక భక్తునికి తోడుగా ఉంటుంటారు. కేవలం ఇద్దరు పాశ్చాత్యుల కధనం ఆధారంగానే Secret Swami అనే బిబిసి డాక్యుమెంటరీ తయారయ్యిందనీ, తన దీర్ఘకాలిక పరిశీలన ప్రకారం అటువంటి ఘటనలకు అవకాశమే లేదనీ మరొక విద్యార్ధి వివరించాడు.


పుట్టపర్తి ఆశ్రమం సెక్రటరీ కె.చక్రవర్తి ఇటువంటి నిందలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. మహా పురుషుల జీవితాలలో వివాదాలు రాకపోలేదనీ, ఇదంతా బాబా లీల అనీ, వివాదాలు వచ్చినా బాబా పట్ల ఆరాధన పెరుగుతూనే ఉన్నదనీ బాబా అనువాదకుడు కుమార్ అన్నాడు . తాను పరిశీలించిన ప్రకారం బాబా ప్రవర్తనలో ఏ మాత్రం అసభ్యత లేదనీ, తాను స్వయంగా బాబా అసాధారణ శక్తులను చూచాననీ డెన్మార్క్‌కు చెందిన తోర్‌బ్జార్ మెయెర్ అన్నాడు.

రాజకీయ దుమారం
2007 జనవరిలో ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించడం, తెలంగాణాను ఏర్పరచడం పాపమని సత్యసాయిబాబా అన్న మాటలు స్థానికంగా రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. ఇందుకు నిరసనగా తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖరరావు, ఇతర తెలంగాణా వాదులు బాబాను తీవ్రంగా విమర్శించారు. పెద్దపెట్టున నిరసన ప్రదర్శనలు జరిగాయి. బాబా అనుయాయుల ద్వారా ప్రతి ప్రదర్శనలు కూడా జరిగాయి.

ఏది ఏమైనా బాబా ఒక ఆధ్యాత్మిక జ్యోతి. ఆ జ్యోతి నేడు ఆరిపోయింది. తిరిగి ప్రేమ సాయి గా అవతరించే తరుణం కోసం కోట్లాది భక్తులు చూస్తున్నారు..ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ఓం సాయి రాం. (వికీపీడియా సౌజన్యం తో)

Sunday, April 3, 2011

తెలుగు వారి ఉగాది.



03.04.2011 తెలుగు వారి ఉగాది. తొలి పండగ..


ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఉగాది ప్రాముఖ్యం

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. [1]. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.

"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.



సంప్రదాయాలు

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు

తైలాభ్యంగనం
నూతన సంవత్సరాది స్తోత్రం
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.[2]

పూజాదులు

అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి


ఉగాది పచ్చడి"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తిని పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటాఱు.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు,ఆ చారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.

ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరిక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం. [3]

ఉగాది ప్రసాదం

ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్నా సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

పంచాంగ శ్రవణం

కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.

నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.
ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

జయహో.. భారతామాతా... క్రికెట్ వరల్డ్ కప్ తో బాటూ..శాంతినీ తీసుకొచ్చావు...




జయహో... భారతామాతా... క్రికెట్ వరల్డ్ కప్ తో బాటూ..శాంతినీ తీసుకొచ్చావు...

ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ గెలవడంతో బాటూ శాంతి నీ ప్రసాదించిందీ వరల్డ్ కప్.ముఖ్యం గా సెమి ఫైనల్ సందర్బం గ పాకిస్తాన్ ప్రధాని తో పాటు పలువురు క్రికెట్ అభిమానులు రావడం ..మనం స్నేహం గా ఆతిధ్యం ఇవ్వడం జరిగింది .ఎప్పుడు పాక్ తో క్రికెట్ జరిగిన ఆ దేశం లోనే చాలామంది కసి తో భారత్ ను శత్రువుగా చూసే వారు .విద్వంసం సృష్టించేవారు .మన చేతి లో ఓడి వెళ్ళిన తమ దేశ ఆటగాళ్లను చాల దారుణం గా అవహేళన చేసే వారు .కాని నేడు వారిలో మార్పు కనిపిస్తోంది .ఆట ను స్పిరిట్ గా తీసుకోవడమే కాదు ...భారత్ ను కూడా గౌరవిస్తునారు .క్రికెట్ పేరు తో నైన పాక్ తో మంచి సంభందాలు ఏర్పడితే భూలక స్వర్గం కాశ్మీర్ లాంటి చోట్ల అనవసర బయాలు ఉండవు .ఆలాగే శ్రీలంక లో కూడా క్రికెట్ శాంతి ని చేకూర్చుతుందని ఆశిద్దాం.

ఇక వివరాలు చూద్దాము...

బహుశా భారతదేశంలో 121 కోట్లమందికే కాదు, ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భారతీయ సంతతికి కూడా ఇది ఓ ఆనందభరిత క్షణం. దాదాపు 28 ఏళ్ళ తరువాత దేశ ప్రజల కల, దాదాపు 21 ఏళ్ళుగా సచిన్ టెండూల్కర్ స్వప్నం నిజమైన క్షణం. విశ్వవిజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచిన క్షణం. 2011 ఐ.సి.సి. వరల్డ్ క్రికెట్ కప్ ను మన జట్టు గెలుచుకున్న గర్వకారణమైన క్షణం. 1983 వరల్డ్ కప్ చూసాను.. , ఆ తరువాత బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్, షార్జా కప్, ఆసియా కప్ ల మీదుగా భారత క్రికెట్ ను ఆసక్తిగా చూస్తూ వస్తున్న నాకు ఇవాళ ఓ ఉద్విగ్నపరిస్థితి. అయితే, కలసికట్టుగా కష్టపడితే ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా ఎలా బయటపడవచ్చో ఇవాళ మన జట్టు మరోసారి నిరూపించింది.

అన్ని మాచ్ లూ చూసిన నేను ఈ ఫైనల్ మాచ్ సమయంలో.. సికిందరాబాదు వెల్తూ ట్రయిన్ లో ఉన్నా.. నా టెన్షన్ చెప్పొద్దూ.. ఎవరికన్నా సెల్ లో కాల్ వస్టే చాలు.. స్కోరెంత అని అడగడం మామూలు అయిపొయింది. మా వాళ్ళ ద్వరా ఎస్.ఎం.ఎస్ ల ద్వరా ప్రతి ఐదు నిముషాలకూ పరిస్తితి సమీక్షించుకుంటూ ఉన్నా.. చూసే వళ్ళకు నాలో నేను మాట్లాడుకొవడం.. పిచ్చి వాడిని అనికూడా అనుకొని ఉండవచ్చు. ఇంటికొచ్చి చివరి సీన్లూ హైలైట్సూ చూస్టే కానీ ప్రాణం కుదుటపడలేదు సుమీ..

ఈ మ్యాచ్ లనుచూస్తున్నప్పుడు దేశంలోని కొన్ని కోట్ల మంది భారతీయ క్రీడాభిమానుల లాగానే నేను కూడా మునుపెన్నడూ లేనంత ఉద్విగ్నతకు గురయ్యాను. చివరకు మనం గెలిచాం. భారత జట్టు సమష్టి కృషే కాదు, ధోనీ కెప్టెన్సీయే కాదు, నా లాంటి కోట్లాది అభిమానులు పాటించిన ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఇవాళ మన జట్టు గెలవడానికి కారణం. ఈ మాటను చాలా మంది కొట్టిపారేయవచ్చు. కానీ, అంతకంతమందికి నా లాంటి సెంటిమెంట్లు ఉంటాయనీ, వాటిని పాటించడం వల్లే మనం కప్పు గెలిచామని వారు ఏకీభవిస్తారనీ అనడంలో నాకు సందేహం లేదు. ఇది పిచ్చి వాదనే కావచ్చు, తర్కానికి నిలవకపోవచ్చు. కానీ, నమ్మకాన్ని మించినది లేదు కదా.

శ్రీలంక బ్యాటింగ్ ముగిసి, 275 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించిన విషయం ఫోన్లో తెలిసి చాల భయపడ్డాను. ఇక మన పని గోవిందా అని కూడా అనుకున్నా. కానీ ఎక్కడో.. తెలీని ఆశ.. మినుకు మినుకు మంటూ...తరువాత, మన వాళ్ళు బ్యాటింగ్ కు దిగే లోపల ఓ మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. "మళ్లీ ఈ రోజు ఈ 275 పరుగుల లక్ష్యం ఛేదించి, గెలుస్తారని కల కనకు. అన్ని సార్లూ అద్భుతాలు జరగవు" అన్నాడు. అసలే శ్రీలంక ఆఖరి 5 ఓవర్ల పవర్ ప్లేలో చేసిన బ్యాటింగ్ దాడి మిత్రుల ద్వారా విని ఉన్న నేను.., బిత్తరపోయి ఉన్న నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రెట్టించి అతను అడిగేసరికి, ఏమనాలో తెలియక - ఏమో గుర్రం ఎగరావచ్చు - అని అపనమ్మకం నిండిన స్వరంతో నమ్మకాన్ని ధ్వనించా. ఆఖరికి నేను అన్నట్లే జరిగింది. సెహ్వాగ్, సచిన్లు బ్యాటింగ్లో విఫలమైనా, గంభీర్, ధోనీల సమయోచిత బ్యాటింగ్తో చివరకు మన జట్టు గెలిచింది. అవును. గుర్రం ఎగిరింది.

కప్పు గెలవగానే నేను వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న అందరితో ఎస్టీడీలు చేసి మరీ ఆనందం పంచుకున్నా. టీవీ వాల్యూమ్ గట్టిగా పెట్టి, డ్యాన్సులు చేశా. ప్రపంచంలోని శతాధిక భారతీయులతో నేనూ గొంతు కలిపా. ఈ ప్రపంచ కప్ తో భారతదేశంలోని సమస్యలేవీ తీరకపోవచ్చు. మన జీవితం ఒక్క కప్పుతో మారకపోవచ్చు. కానీ, జాతి మొత్తం జయహో అనే క్షణాలు చాలా కొద్దిగా వస్తాయి. రకరకాల విభేదాలు, అంతరాలు, కుమ్ములాటలతో కుంగిపోతున్న నవ భారతావనికి ఇప్పుడు సరికొత్త స్ఫూర్తిప్రదాతలు దొరికారు. క్రీడల్లోనే కాదు, జీవితంలోనూ ఇవాళ మనకు ఇలాంటి స్ఫూర్తిదాతలు, గర్వకారకులు ఎంతైనా అవసరం. అందుకే, ఈ మన విజయం జీవిత కాలంలో ఓ చిరస్మరణీయ జ్ఞాపకం. భారత జట్టుకే కాదు, మనం గెలవాలనీ, గెలుస్తామనీ నమ్మిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.



"మెట్టసీమ-జగ్గంపేట" మరియూ.."ఇష్టపది" .వారికి ధన్యవాదాలతో..

(బ్లాగు మిత్రులందరికీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వేజనా : సుఖినో భవన్తు... సమస్త సన్మంగళాని భవన్తు).