సంఘములో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది. భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గానజాలము. మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి. లాంటి తరుణం లో....ఒక జంట.. ఒక దంపతులు.. 50 సంవత్సరాల వైవాహిక జీవితం గడపి స్వర్ణొత్సవం చేసుకుంటున్నారంటే...ఆనందం అవధులు లేవు. అందునా మీదు మిక్కిలి.. ఆ జంట నాకు స్వయానా.. సోదరీ మణీ..లీలావతీ, మరియూ బావ సత్యనారాయణ కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది.
నూటికో..వెయ్యికో.. ఒక జంటకు మాత్రమే..జరిగే ఈ ఆనంద హేల.. మన కుటుంబ సభ్యులకు జరగడం మీదు మిక్కిలి హృద్యంగమం. మహాత్మా గాంధీజీని ఒక సారి ఎవరో మీ సందేశం ఎమిటి? అని అడిగితే.. ఆయన నవ్వేసి.. నా జీవితమే.. నా సందేశం అన్నాట్ట. అలాగే.. వీరి ఆదర్శ జీవితమే.. మనకు గొప్ప సందేశం..
(చిత్రం పైన క్లిక్ చేసి పెద్దది గా చూడవచ్చు)
పైన ఉన్న శుభ లేఖ నా చిన్న తనంలో.. మినగల్లు లో దొరికిన దాన్ని.. భద్ర పరచి.. మీ ముందు ఉంచాను.. బ్ర.వే..రావిప్రోలు సత్యనారాయణ, లీలావతి గార్ల కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రు..ఇంకా ముది మనుమలూ.. ఇంకా కొన్ని తరాల వారు .. ఆనందంతో.. వీక్షిస్తారని భావిస్తున్నాను.
తిధుల ప్రకారం శ్రావణ శుద్ధ పంచమి ఈ 50 వ వార్షికోత్సవం ఆగస్ట్ నెల 4వ తేదీ ,2011 న వచ్చింది. ఆ రోజున ముంబాయి లోని "వాషి" లోగల బాలాజీ, సత్య సాయి బాబా దేవాలయములో ఉదయము 8 గంటలనుండి..12.30 గణపతి, ఆయుష్ హోమాలూ, పూజలూ జరగనున్నాయి. మధ్యాన్నం 1 గంట కు భోజనం.
ఆరోజున కారణాంతరాల వల్ల ముంబాయి రాలేని వారికీ...హైదరాబాదు నివాసులకూ..మిగతా బంధు వర్గానికీ..ఆగస్ట్ నెల 13వ తేదీ గాంధీనగరు లోని వారి స్వగృహం లో "సత్య నారాయణ వ్రతము" జరుగును. అందరూ విచ్చేసి ఆనందించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించవచ్చు.అలాగే..ఆగస్ట్ నెల 14 వ తేదీ 2011 రాత్రి 7 గంటలకు, "మోక్ష హోటెల్" (నెక్లెసు రోడ్డు) లో విందు కార్యక్రమము నిర్వహిస్తున్నారు.
బంధు వర్గం మరియూ స్నేహిత బృందమూ.. వారి వారి అనుకూలనుసారం.. ముంబయి లేక హైదరాబాదులో హాజరై పెద్దలు తమ ఆశీస్సులను అందజేయండి. పిల్లలు ఆ పుణ్య దంపతుల అశీర్వచనం తీసుకోండి.
25 వ సంవత్సరం "సిల్వర్", 30 వ సంవత్సరం "పెరల్", 40 వ సంవత్సరం "రూబీ" 50 వ సంవత్సరం "గోల్డ్" 60 వ సంవత్సరం "డయమండ్" , 70 వ సంవత్సరం "ప్లాటినం" ఇలా జరుపుకోవడం ఆనవాయితీ గా ఉంది. ఈ దంపతులు కూడా..60 వ సంవత్సరం "డయమండ్ వార్షికోత్సవం" , 70 వ సంవత్సరం "ప్లాటినం వార్షికోత్సవం" జరుపుకోవాలనీ ఆ తర్వాత వైవాహిక జీవనం "శతాబ్ది వార్షికోత్సవం" జరుపుకోవాలనీ.. మనస్ఫూర్తిగా ఆ "అమ్మల గన్న యమ్మ, ముగ్గురమ్మల వేల్పులటమ్మ" ను ప్రార్ధిస్తూ శెలవు తీసుకుంటున్నాను.
భవదీయుడు..
గమనిక: ముందుగా శుభాకాంక్షలు తెలియ జేయాలనుకునేవారు శ్రీ రావిప్రోలు సత్యనారాయణ గారికి.. 098 199 49 192 కు, శ్రీమతి లీలావతి గారికి 098 694 03 169 కి ఎసెమ్మెస్ ద్వారా లేక ఫోను ద్వారా తెలియ జేయ వచ్చు.