నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Tuesday, May 4, 2010

సుజన రంజని వారి సమస్యా పూరణ.

మూడవ పూరణ - టి.వెంకటప్పయ్య, సికిందరాబాద్

ఆ.వె.||పెద్దలంత జేరి బెండ్లిని గూర్చగ
కర్మ గాలె నంత కర్ఫ్యు బెట్ట!
నగర జనము లెల్ల నానాక పాట్లురా!
వేళ కాని వేళ వెంకటేశ!



ఆ.వె.|| తాడి చెట్టు నీడ తాగినా పాలను
కల్లు యనదె నిన్ను తల్లి అయిన!
సకలపనులకెల్ల సమయము నెరగుమా!
వేళ కాని వేళ వెంకటేశ!


link: http://siliconandhra.org/nextgen/sujanaranjani/may10/padyamhrudyam.html

1 comments:

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు
సమస్యా పూరణ పద్యాలు చక్కగా ఉన్నాయి అలతి అలతి పదాలతొ అలరించేలా బాగున్నాయి అభినందనలు నేను నేర్చు కోవాలి

Post a Comment