టేకుమళ్ళ వంశము గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీకు మనవి చెయ్య దలుచుకున్నాను. ఇంటి పేర్లు మన పూర్వీకులు నివసించిన ఊర్లను బట్టి సాధారణంగా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసినదే!. ఐతే "టేకుమట్ల" అనే వూరు నల్గొండ జిల్లా లో (హైదరాబాదు - విజయవాడ రోడ్డు మార్గం లో) ఉంది. అదే కాలక్రమేణా "టేకుమళ్ళ" గా మారి ఉండ వచ్చు. అదే, టేకుమళ్ళ వారి పూర్వీకుల జన్మ స్తలం గా భావించడం జరుగుతోంది. ఈ వంశానికి భ్రుగు మహర్షి ఆది మూలం గా ఆర్యులు చెప్తారు. ఆ వంశం లో "భార్గవ, వీతహవ్య మరియూ సావేదస " మహర్షులు ఉన్నారు. వైదీకి బ్రాహ్మణులు తెలగాణ్యులు గా ఉన్నారు. అయితే, వెలనాడు శాఖ లో కూడా ఈ ఇంటి పేరు ఉండడం గమనార్హం.
అసలు ఈ ఇంటి పేరు ఎంత పురాతనమైనదో ఒక పరిశీలన చెయ్యడం జరిగింది. మొదట గా ఈ ఇంటిపేరు తో "టేకుమళ్ళ రంగ శాయి" అనే నెల్లూరు వాసి ప్రభంద యుగము చివరలో సుమారు గా 1632లో ధర్మపురి అనే ప్రాంతం లో పుష్పగిరి తిమ్మన, కంకంటి పాపరాజు కు సమకాలికుడు గా ఉన్నాడు. ఈయన వీర రాఘవ శతకం తో ఆరంభించి, కృష్ణ రాజ దండకము, జానకీ పరిణయము అనేయక్ష గానమూ, మహా భాగవతాన్ని ద్విపద కావ్యం గా అనువదించాడు. అలాగే "వాణీ విలాస వన మాలిక" అనే "విజ్ఞాన సర్వస్వాన్ని" రచించాడు. ఆరుద్ర తన "సమగ్రాంధ్ర చరిత్ర" లో ఆయనను కొనియాడుతూ, ఇది చాల కొత్త తరహా రచన, వేదాలు, పురాణాలు, ఉప పురాణాలు, స్మృతులూ, షట్దర్శనాలు, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, ఆయుర్వేదము,వాస్తు. మొదలైన అన్ని విషయాలూ మాల లాగ గుచ్చాడట. ఈ గ్రంధం రాయబోయే ముందు పెద్దల అనుమతి కోరగా వారు ఈ కింది విధం గ చెప్పారని ఆయన పేర్కొన్నాడు.
ఊరు శుభ నన్మతిన్ దిరువళూరి పురాధిప వీర రాఘవ
స్తిర శతకంబు కృష్ణ గుణ దీపిత దండకమొప్పు జానకీ
పరిణయ యక్ష గానమును భాగవత ద్విపద ప్రభందమున్
విరచన చేసినట్టు లిది వేడ్క నొనర్పు రంగ ధీనిధీ!
కొసమెరుపు ఏంటంటే! ఈ పుస్తకం ఇప్పుడు మన దేశం లో లభించడం లేదు. డెన్మార్క్ వాళ్ళు అమ్ముతున్నారు.
ఇక ఈ పోస్టింగ్ ముగించి నెక్స్ట్ పోస్టింగ్స్ లో మా పూర్వీకులు, తాత తండ్రుల పేర్లు, వారి విశేషాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సెలవు.
ఈ క్రింద కొన్ని వెబ్ సైటు లింకులు , శ్రీ టేకుమళ్ళ రంగ సాయి గారి కి సభందించిన వి ఇస్తున్నాను. మీ కాలం అనుమతిస్తే చూడండి.
http://www.esamskriti.com/essay-chapters/History-of-Telegu-1.aspx.
http://www.archive.org/stream/Palkuriki_233/YakshaGanam_djvu.txt
అల్లసాని వారి అల్లిక జిగిబిగి
-
చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలా రావడానికి
జ్యోతి వలబోజు గారి "మాలిక" పత్రిక లో నా "అల్లసాని వారి అల్లిక జిగిబిగి" అనే
అంశం...
1 comments:
GooD One Babai
Post a Comment