తెలుగు వారి ప్రత్యేకత వారి ఇంటిపేర్లు. ప్రతీ తెలుగు వాడికీ, పుట్టుకతో వచ్చేది ఇంటిపేరు. నిజం చెప్పాలంటే ఇది ప్రతి తెలుగువాడిక్ వుండే 'వంశ నామం'. ఇంగ్లీష్ లో 'సర్ నేమ్స్' అంటారు. బారసాల నాడు పెట్టే పేరు ఆ మనిషి పేరుగా చెలామణి అవుతుంది. ఈ పేరు (బారసాల నాడు పెట్టిన పేరు), ఇంటిపేరు తరువాత వస్తుంది. ఈ మధ్య కాలంలో, బారసాల నాడు పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు తరువాత వచ్చేలా (ఉత్తర భారత దేశంలోని ప్రజలు, యూరప్, అమెరికాలలోని ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు) యువతరం మార్చుకుంటుంది. మన తెలుగు వారి ఇంటిపేరు సంప్రదాయం, క్రమ క్రమంగా మా ర్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు (పాశ్చాత్యులు, ఉత్తర భారతీయుల వలె). ఈ ఇంటి పేర్ల మార్పు, సైనిక విభాగాలైన, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అమెరికా లో వున్న తెలుగు వారిలోను, కంప్యూటర్ రంగంలో వున్న యువతరం వారిలోను కనిపిస్తుంది. ఇంటిపేరు తరతరాలుగా మారకుండా వుండి, వారి యొక్క వంశనామంగా వుంటుంది. తమిళులకు ఇంటి పేర్లు లేవు. వారి తండ్రి పేరే, వారికి ముందు వుంటుంది. తరువాత వారి 'బారసాల నాడు' పెట్టే పేరు వస్తుంది. ఎక్కడైనా, ఇంటిపేరు వున్న తమిళుడు కనిపిస్తే, ఆ తమిళుడు, ఖచ్చితంగా , వందల సంవత్సరాల క్రితం తెలుగుదేశం నుంచి వలస పోయిన తెలుగు కుటుంబానికి చెందిన వాడే అయివుంటాడు. అదన్న మాట తెలుగువాడి 'ఇంటిపేరు' శక్తి, సత్తా.
తెలుగు వారి ఇంటి పేర్లను ఈ క్రింది విధంగా విభజించ వచ్ఛును.
గ్రామ నామాలు :(ఘంటసాల, వేమూరి, ఘండికోట, గుత్తి, మురమళ్ళ, ముమ్మిడివరపు, అమలాపురపు, తణుకు, నిడదవోలు,ఆచంట)
మన శరీరం లోని అవయవాల పేర్లు :(బొజ్జా, బొడ్డు, ముక్కు,గోళ్ళ)
జంతువుల పేర్లు :(గేదెల, ఆవుల, మేకల, గొర్రెల, ఎడ్ల, దున్నపోతుల, పిల్లి, నక్కా, కుక్కల, పులి, పంది,గుర్రం)
పక్షుల పేర్లు : కాకి, పిచ్చిక, బాతు
పువ్వుల పేర్లు : మల్లెల, చామంతుల,
తినే వస్తువుల పేర్లు :(పెసలు, నేతి, బియ్యం, నూనెల, వంకాయల, కాజా)
వస్తువుల పేర్లు : (బీగాల, కత్తి)
వేదాల పేర్లు :(ఋగ్వేదం, సామవేదం, వేదం, వేదుల, ద్వివేదుల, చతుర్వేదుల)
వృత్తుల పేర్లు :(సోమయాజుల, అయ్యల సోమయాజుల, దొంగ, కమ్మరి)
రాజుల వంశనామాలు :(వీరివి 32 వంశనామాలు వున్నాయని చెబుతారు. వీరి ఇంటి పేర్లను బట్టి వీరు క్షత్రియులా కాదా అని గుర్తుపట్టగలరు.కానీ భట్రాజులు కూడా వీరిలో కలిసిపోతారు. పెళ్ళిళ్ళు సమయాలలో, ఈ ఇంటిపేర్లు ప్రముఖంగా చర్ఛకు వస్తాయి.
కమ్మవారి ఇంటి పేర్లలో చివర 'నేని' 'పాటి' వంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి(అక్కినేని, దేవినేని,సబ్బినేని, వీరపనేని, తమ్మినేని, మిక్కిలినేని, ఘట్టమనేని, రామినేని, మాలెంపాటి, కొర్రపాటి,గొట్టిపాటి...)
విశ్వబ్రాహణులు వారి ఇంటి పేర్లలొ 'జు' అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది (కొమ్మోజు, లక్కోజు)
ఆర్యవైశ్యులు మాత్రం, తమ కులం లో వున్న 101 గోత్రాల వైశ్యుల యొక్క ఇంటిపేర్లను (గోత్రాలతో సహితంగా) పుస్తక రూపంలో ప్రకటించుకుని, తెలుగు వారికి మార్గ దర్శకులయ్యారు. వారు, 101 గోత్ర నామాలు ఒక కోలం లో ఇచ్చి, మరొక కోలం లో, ఆ గోత్రం లో వున్న వారి 'ఇంటిపేర్లు' ఇచ్చారు.
రెడ్లు ఇంటిపేర్లలో, కొందరి వంశనామాలలొ 'రెడ్డి' అనే పదం ఇంటిపేరుతో కలిపి కనిపిస్తుంది.
ఆంధ్రజ్యోతి వారపత్రిక కొన్ని సంవత్సరాల క్రితం, ఈ 'ఇంటిపేర్లు' పై ఒక శీర్షిక నిర్వహించి, ఆంధ్ర దేశంలోని ప్రజల నుంచి, చాలా వివరాలు ప్రకటించింది. అందులో, పాఠకులు పాల్గొని, తమ తమ ఇంటిపేర్ల వివరాలు, ఆ ఇంటిపేర్లు రావటానికి గల కారణాలు, చరిత్ర వివరించారు.

0 comments:
Post a Comment