నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Saturday, January 30, 2010

ఫిబ్రవరి నెల కు స్వాగతం


ఫిబ్రవరి నెల కు స్వాగతం!!!

Tuesday, January 26, 2010

గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు!!!!



మన వెబ్ సందర్శకులకు నా గణతంత్ర దిన శుభాభినందనలు!

తే!గీ! తగవు లాటలు మానండి తగవు! మీకు!
పూజ్య బాపూజి మాటలు పూజ్యమేన?
ఆంధ్ర యన్నది అందరి ఆశ గాదె!
కలిసి ఉండిన కలుగును కలిమి మీకె!

నేను సమైక్య వాదిని కాదు. అలా అని ప్రత్యేక వాదినీ కాను.
కుమ్ములాటలు మాత్రం తగవు అని చెప్తున్నాను.
కలిసి వుంటె కలదు సుఖం!

ఈ మాట కేవలం అంధ్రా తెలంగాణాకోసం చెప్పడం లేదు. మన కుటుంబానికైనా
ఇదే సూక్తి వర్తిస్తుంది కదా! అలోచించండి!!!

సదా మీ అభిమానం కోసం ఎదురు చూసే....

మీ

టేకుమళ్ళ వెంకటప్పయ్య.
26-01-2010.

Wednesday, January 20, 2010

టేకుమళ్ళ వంశస్తులకు ఒక శుభ వార్త.

నేను గతం లో చెప్పిన విధంగా మనం గర్వించదగ్గ మన వంశస్తుడుశ్రీ టేకుమళ్ళ రంగ శాయి కవి 1632 సం.లో రచించిన "వాణీ విలాస వనమాలిక అనే గ్రంధాన్ని అతి కష్తం మీద జెర్మనీ లో ఉన్న శ్రీ పరుచూరి శ్రీనివాస్ అనే ఒక మహానుభావుడి దయ వలన సంపాదించ గలిగాననిచెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను.
నా సంతోషం కొద్దీ ఆ పుస్తకం లోని మొదటి పేజీ ని పైన ఉంచుతున్నాను. చూడండి
మన టేకుమళ్ళ వంశజుడు, నెల్లూరు నివాసి, సాధించిన ఘన విజయాలు చూసి ఆనందిస్తారని ఆశిస్తాను. ఎవరైనా పై పుస్తకం చదవాలని అనుకుంటే నాకు తెలియ జేయండి. శెలవు....టేకుమళ్ళ వెంకటప్పయ్య.

Wednesday, January 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు







మన బంధు కోటికీ, మిత్రులకూ సంక్రాంతి శుభాకాంక్షలు!





తే గీ పిల్ల పాపల తోడుగ చల్ల గాను!
ఆయు రారోగ్య ఐశ్వర్య దాయు లవగ!
దేవు డిచ్చును మీకిల దేయ మనఘ!
సకల శుభముల నిచ్చుమ సంకు రాత్రి !
మీ మీ అనుభవాలు సంతోషాలు, బ్లాగు లో "వ్యాఖ్య" ల రూపం లో తెలియజేయండి. మీ ఫోటోలు, విశేషాలు పంపండి. ఈ మెయిల్ పంపండి.

Saturday, January 9, 2010

చి.ల.సౌ. హరిణి - జన్మ దిన వేడుక.



చి.ల.సౌ. హరిణి - జన్మ దిన వేడుక.
చి.ల.సౌ. హరిణి 26వ జన్మ దిన వేడుక 03-01-10 తేది, ఆదివారంమియాపూర్ లో గల వారి స్వగృహం లో వైభవోపేతం గా జరిగింది. దాదాపు 25మంది హాజరయ్యారు. ఆరోజు రాత్రి జరిగిన విందు కు చి.ప్రదోష్ కుమార్, చి.ల.సౌ.బిందు, చి.రంజిత్, చి.ల.సౌ.అరుణ, చైతన్య మరియూ వారి కుటుంబ సభ్యులు, కృష్ణ ప్రసాద్ మరియూ వారి కుటుంబ సభ్యులూ హాజరయ్యారు. సశాస్త్రీయంగా పూజాదికాలు నిర్వహించారు. అలాగే, కాలానుగుణం గా పాశ్చాత్య పధ్ధతి లో, బర్తు డే కేకు ని కూడా కట్ చేసి పంచిపెట్టడం జరిగింది. పెద్దలు ఆశీస్సులు అందజేయగా, పిల్లలు అంత్యాక్షరి వంటి ఆట పాటలతో ఆనందంగా గడిపామని తెలిపారు.

Thursday, January 7, 2010

ఇంటి పేర్లు ఎలా వచ్చాయి?

తెలుగు వారి ప్రత్యేకత వారి ఇంటిపేర్లు. ప్రతీ తెలుగు వాడికీ, పుట్టుకతో వచ్చేది ఇంటిపేరు. నిజం చెప్పాలంటే ఇది ప్రతి తెలుగువాడిక్ వుండే 'వంశ నామం'. ఇంగ్లీష్ లో 'సర్ నేమ్స్' అంటారు. బారసాల నాడు పెట్టే పేరు ఆ మనిషి పేరుగా చెలామణి అవుతుంది. ఈ పేరు (బారసాల నాడు పెట్టిన పేరు), ఇంటిపేరు తరువాత వస్తుంది. ఈ మధ్య కాలంలో, బారసాల నాడు పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు తరువాత వచ్చేలా (ఉత్తర భారత దేశంలోని ప్రజలు, యూరప్, అమెరికాలలోని ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు) యువతరం మార్చుకుంటుంది. మన తెలుగు వారి ఇంటిపేరు సంప్రదాయం, క్రమ క్రమంగా మా ర్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు (పాశ్చాత్యులు, ఉత్తర భారతీయుల వలె). ఈ ఇంటి పేర్ల మార్పు, సైనిక విభాగాలైన, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అమెరికా లో వున్న తెలుగు వారిలోను, కంప్యూటర్ రంగంలో వున్న యువతరం వారిలోను కనిపిస్తుంది. ఇంటిపేరు తరతరాలుగా మారకుండా వుండి, వారి యొక్క వంశనామంగా వుంటుంది. తమిళులకు ఇంటి పేర్లు లేవు. వారి తండ్రి పేరే, వారికి ముందు వుంటుంది. తరువాత వారి 'బారసాల నాడు' పెట్టే పేరు వస్తుంది. ఎక్కడైనా, ఇంటిపేరు వున్న తమిళుడు కనిపిస్తే, ఆ తమిళుడు, ఖచ్చితంగా , వందల సంవత్సరాల క్రితం తెలుగుదేశం నుంచి వలస పోయిన తెలుగు కుటుంబానికి చెందిన వాడే అయివుంటాడు. అదన్న మాట తెలుగువాడి 'ఇంటిపేరు' శక్తి, సత్తా.
తెలుగు వారి ఇంటి పేర్లను ఈ క్రింది విధంగా విభజించ వచ్ఛును.
గ్రామ నామాలు :(ఘంటసాల, వేమూరి, ఘండికోట, గుత్తి, మురమళ్ళ, ముమ్మిడివరపు, అమలాపురపు, తణుకు, నిడదవోలు,ఆచంట)
మన
శరీరం లోని అవయవాల పేర్లు :(బొజ్జా, బొడ్డు, ముక్కు,గోళ్ళ)
జంతువుల పేర్లు :(
గేదెల, ఆవుల, మేకల, గొర్రెల, ఎడ్ల, దున్నపోతుల, పిల్లి, నక్కా, కుక్కల, పులి, పంది,గుర్రం)
పక్షుల పేర్లు :
కాకి, పిచ్చిక, బాతు
పువ్వుల పేర్లు :
మల్లెల, చామంతుల,
తినే వస్తువుల పేర్లు :(
పెసలు, నేతి, బియ్యం, నూనెల, వంకాయల, కాజా)
వస్తువుల పేర్లు : (
బీగాల, కత్తి)
వేదాల పేర్లు :(ఋగ్వేదం, సామవేదం, వేదం, వేదుల, ద్వివేదుల, చతుర్వేదుల)
వృత్తుల పేర్లు :(సోమయాజుల, అయ్యల సోమయాజుల, దొంగ, కమ్మరి)
రాజుల వంశనామాలు :(వీరివి 32 వంశనామాలు వున్నాయని చెబుతారు. వీరి ఇంటి పేర్లను బట్టి వీరు క్షత్రియులా కాదా అని గుర్తుపట్టగలరు.కానీ భట్రాజులు కూడా వీరిలో కలిసిపోతారు. పెళ్ళిళ్ళు సమయాలలో, ఈ ఇంటిపేర్లు ప్రముఖంగా చర్ఛకు వస్తాయి.
కమ్మవారి ఇంటి పేర్లలో చివర 'నేని' 'పాటి' వంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి(అక్కినేని, దేవినేని,సబ్బినేని, వీరపనేని, తమ్మినేని, మిక్కిలినేని, ఘట్టమనేని, రామినేని, మాలెంపాటి, కొర్రపాటి,గొట్టిపాటి...)
విశ్వబ్రాహణులు వారి ఇంటి పేర్లలొ 'జు' అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది (కొమ్మోజు, లక్కోజు)
ఆర్యవైశ్యులు మాత్రం, తమ కులం లో వున్న 101 గోత్రాల వైశ్యుల యొక్క ఇంటిపేర్లను (గోత్రాలతో సహితంగా) పుస్తక రూపంలో ప్రకటించుకుని, తెలుగు వారికి మార్గ దర్శకులయ్యారు. వారు, 101 గోత్ర నామాలు ఒక కోలం లో ఇచ్చి, మరొక కోలం లో, ఆ గోత్రం లో వున్న వారి 'ఇంటిపేర్లు' ఇచ్చారు.
రెడ్లు ఇంటిపేర్లలో, కొందరి వంశనామాలలొ 'రెడ్డి' అనే పదం ఇంటిపేరుతో కలిపి కనిపిస్తుంది.
ఆంధ్రజ్యోతి వారపత్రిక కొన్ని సంవత్సరాల క్రితం, ఈ 'ఇంటిపేర్లు' పై ఒక శీర్షిక నిర్వహించి, ఆంధ్ర దేశంలోని ప్రజల నుంచి, చాలా వివరాలు ప్రకటించింది. అందులో, పాఠకులు పాల్గొని, తమ తమ ఇంటిపేర్ల వివరాలు, ఆ ఇంటిపేర్లు రావటానికి గల కారణాలు, చరిత్ర వివరించారు.

Friday, January 1, 2010

టేకుమళ్ళ వంశ వృక్షము

టేకుమళ్ళ సుబ్రహ్మణ్యం (1) & భార్య హనుమాయమ్మ (2) (ఓరుగంటి వారి ఆడ పడచు)
పై వారి మగ సంతానము క్రింద ఇవ్వబడింది.
1. టేకుమళ్ళ లక్ష్మీ నరసింహం (2008 సం. లో స్వర్గలయ్యారు.) (3) & భార్య లలితాంబ (4) (కలుజులపాటి వారి ఆడపడచు)
2.టేకుమళ్ళ వెంకట శేషయ్య (5) & భార్య వసుంధర (గట్టుపల్లి) (6)
3. టేకుమళ్ళ సురేంద్ర నాధ్(రామయ్య అని పిలవబడే వారు) - 1986 సం.లో స్వర్గస్తులయ్యారు (7) & భార్య శశికళ (సిరిసినగండ్ల) (8)
4. టేకుమళ్ళ వెంకటప్పయ్య (9) & భార్య చిదంబరి (పులిగండ్ల) (1౦)
5. టేకుమళ్ళ నాగ రాజు (11) , భార్య కామాక్షి (కప్పర)(12)
పై వారి ఆడ సంతానము క్రింద ఇవ్వబడింది.

6. లీలావతి (రంగమ్మ)(1౩) (ఈవిడ లక్ష్మీ నరశిం హం

తర్వాత జన్మించినది) భర్త రావిప్రోలు సత్యనారాయణ.

7. సౌభాగ్యవతి (14) ఈవిడ సురేంద్ర నాధ్ తర్వాత జన్మించినది. భర్త తంగిరాల తిరుపతి శర్మ (కుత్స్నసగోత్రీకులు)

ఇక పై వీరి సంతానము యొక్క వివరాలు తర్వాతి పోస్టింగు లో చూద్దాము.




టేకుమళ్ళ వంశము

టేకుమళ్ళ వంశము గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీకు మనవి చెయ్య దలుచుకున్నాను. ఇంటి పేర్లు మన పూర్వీకులు నివసించిన ఊర్లను బట్టి సాధారణంగా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసినదే!. ఐతే "టేకుమట్ల" అనే వూరు నల్గొండ జిల్లా లో (హైదరాబాదు - విజయవాడ రోడ్డు మార్గం లో) ఉంది. అదే కాలక్రమేణా "టేకుమళ్ళ" గా మారి ఉండ వచ్చు. అదే, టేకుమళ్ళ వారి పూర్వీకుల జన్మ స్తలం గా భావించడం జరుగుతోంది. ఈ వంశానికి భ్రుగు మహర్షి ఆది మూలం గా ఆర్యులు చెప్తారు. ఆ వంశం లో "భార్గవ, వీతహవ్య మరియూ సావేదస " మహర్షులు ఉన్నారు. వైదీకి బ్రాహ్మణులు తెలగాణ్యులు గా ఉన్నారు. అయితే, వెలనాడు శాఖ లో కూడా ఈ ఇంటి పేరు ఉండడం గమనార్హం.
అసలు ఈ ఇంటి పేరు ఎంత పురాతనమైనదో ఒక పరిశీలన చెయ్యడం జరిగింది. మొదట గా ఈ ఇంటిపేరు తో "టేకుమళ్ళ రంగ శాయి" అనే నెల్లూరు వాసి ప్రభంద యుగము చివరలో సుమారు గా 1632లో ధర్మపురి అనే ప్రాంతం లో పుష్పగిరి తిమ్మన, కంకంటి పాపరాజు కు సమకాలికుడు గా ఉన్నాడు. ఈయన వీర రాఘవ శతకం తో ఆరంభించి, కృష్ణ రాజ దండకము, జానకీ పరిణయము అనేయక్ష గానమూ, మహా భాగవతాన్ని ద్విపద కావ్యం గా అనువదించాడు. అలాగే "వాణీ విలాస వన మాలిక" అనే "విజ్ఞాన సర్వస్వాన్ని" రచించాడు. ఆరుద్ర తన "సమగ్రాంధ్ర చరిత్ర" లో ఆయనను కొనియాడుతూ, ఇది చాల కొత్త తరహా రచన, వేదాలు, పురాణాలు, ఉప పురాణాలు, స్మృతులూ, షట్దర్శనాలు, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, ఆయుర్వేదము,వాస్తు. మొదలైన అన్ని విషయాలూ మాల లాగ గుచ్చాడట. ఈ గ్రంధం రాయబోయే ముందు పెద్దల అనుమతి కోరగా వారు ఈ కింది విధం గ చెప్పారని ఆయన పేర్కొన్నాడు.

ఊరు శుభ నన్మతిన్ దిరువళూరి పురాధిప వీర రాఘవ
స్తిర శతకంబు కృష్ణ గుణ దీపిత దండకమొప్పు జానకీ
పరిణయ యక్ష గానమును భాగవత ద్విపద ప్రభందమున్
విరచన చేసినట్టు లిది వేడ్క నొనర్పు రంగ ధీనిధీ!
కొసమెరుపు ఏంటంటే! ఈ పుస్తకం ఇప్పుడు మన దేశం లో లభించడం లేదు. డెన్మార్క్ వాళ్ళు అమ్ముతున్నారు.
ఇక ఈ పోస్టింగ్ ముగించి నెక్స్ట్ పోస్టింగ్స్ లో మా పూర్వీకులు, తాత తండ్రుల పేర్లు, వారి విశేషాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సెలవు.
ఈ క్రింద కొన్ని వెబ్ సైటు లింకులు , శ్రీ టేకుమళ్ళ రంగ సాయి గారి కి సభందించిన వి ఇస్తున్నాను. మీ కాలం అనుమతిస్తే చూడండి.
http://www.esamskriti.com/essay-chapters/History-of-Telegu-1.aspx.
http://www.archive.org/stream/Palkuriki_233/YakshaGanam_djvu.txt