నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com

Tuesday, August 24, 2010







అమ్మలోని ఆప్యాయతను అందిపుచుకున్న అనురాగానివి నువ్వు,నాన్నలోని నిరాడంబరతను నింపిబుచుకున్న నువ్వు, ప్రతి క్షణం ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు, అనుక్షణం అబిమానాన్ని అందించే అపురూపానివి నువ్వు, చిరునవ్వుల ఉదయాలతో నా గుండెలో ఆనందపు కిరణాలను ప్రసరిస్తావు, మధురమైన మాటలతో నా మనసులొ చిరుజల్లులు కురిపిస్తావు, ఈ ప్రేమ ప్రతి క్షణం నాకు నీడలా తోడుండాలని, నీకు ప్రతీక్షణం నేను తండ్రిలా తోడుంటానని ఈ రక్షాబంధనం ద్వారా తెలుపుతున్నాను, "రక్షాబంధనం" శుభాకాంక్షలు నా చిరునవ్వుల సోదరీ మణులైన శ్రీమతి లీలావతి మరియూ శ్రీమతి సౌభాగ్య లక్ష్మి అక్కయ్యలకు ... ప్రేమతో... రాఖీ శుభాకాంక్షలు.


ప్రాముఖ్యత:

భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.ఈ పండుగ మూడు నాలుగు రకాలుగా కూడా ఉంది. రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, హయగ్రీవ పూజ, వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం :

'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'



దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.


దైవీశక్తులతో కూడిన శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు. శక్తిస్వరూపిణిగా వ్యవహరించబడే ఇంటి ఆడపడచు(సోదరి) చేత ఈరోజు రక్షాబంధనం కట్టించుకున్న సోదరులకు దేవతలు రక్ష గా నిలిచి అరిష్టాలను తొలగిస్తారని, అన్నింటా అండదండగా నిలుస్తారని విశ్వాసం. ఈరోజున బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తదితర జంధ్యాన్ని ధరించే అన్ని కులాలవారు స్నానాన్ని ఆచరించి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి ఉపాకర్మ జరిపిస్తారు. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అని పేరొచ్చింది. ఈరోజునే హయగ్రీవ జయంతి "జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే' అంటూ సర్వవిద్యలకూ ఆధారభూతంగా చెప్పుకునే హయగ్రీవుని స్తుతించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్ర వచనం.






Thursday, July 22, 2010

గురు పౌర్ణమి




గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో ...? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం "వారణాశి" లో కదుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాదు, ఒకరోజునదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్సిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూత్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న 'వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులులతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు 'సాలగ్రామమూ, 'తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా1 మీకు ఎమి వరకావాలో కోరుకోండి. నోమూలూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలాను అనుభవిస్తూ; అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని 'వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు.....!....!....!

"శృణు విప్రతవేచ్చా చేత్ దర్శనార్థం తదాత్వయా

పూఅజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం"

అని అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.

అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విస్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వార్మి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్దపాద్యమి"నాడు వార్కి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము గమనిస్తున్నాము గదా!'-మరి. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః

ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా

పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః

దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్

ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం

భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుకాగురువారమూ అయిన ఎడలాది మరింతగా స్రేష్ఠమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్నమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

అట్టి పరమ పవిత్రమైన "గురుపౌర్ణమి" పుణ్యదినం మనంతా విశేషంగా జరుపుకుని ముందు తరాలవార్కి మార్గదర్శకుల మౌతూ, పునీతులౌదాము.

(Telugu danam vaariki veyi krutagnatalato)

Thursday, July 15, 2010

జేజ నాయనమ్మకు కనకాభిషేకం

టేకుమళ్ళ హనుమాయమ్మ అంటే మా జేజ నాయనమ్మకు (మా నాన్న గారి నాన్న గారి అమ్మ అన్నమాట) 20 వ తేదీ, జూన్ నెల ఆదివారం ఉదయం 9.30 గంటలకు నెల్లూరు లో,ఏ.సి.నగరు నందు, సుమ అవెన్యూ అపార్ట్మెంట్సు, గ్రవుండ్ ఫ్లోర్, నందు, ఆమె ముది మనుమడు టేకుమళ్ళ చంద్రహాస్ చక్రవర్తి చే (అంటే నేనే అన్నమాట) "కనకాభిషేకము" ఘనంగా జరిగింది.దాని విశేషాలు చెప్పనా మీకు.



నేను రెడీ అయ్యానోచ్


హమ్మయ్య ఇప్పటికి కూర్చున్నారా! కానీండి త్వరగా!



పంతులు గారు పూజ బాగా చేస్తున్నారు..


నాకు బాగా ఆకలి గా ఉంది బాబూ..



జేజ నాయనమ్మకు పూల మాల వేస్తున్నామోచ్.



బట్టలు ఇస్తున్నారు.



మా నానమ్మకు తాత గారికి బట్టలు. అరవకండి. మా తాత గారికి అసలే కోపం తిడతారు.



కాళ్ళు కడుగుతున్నాము.



కనకాభిషేకం ప్రారంభం అయ్యింది. నిశ్శబ్దం అంతా!



అన్నీ బంగారు పూలే ఒట్టు..




వాసూ తాత.. హి .. హి..



తిరుపతయ్య తాత సౌభాగ్య అవ్వ గార్లు.



మీ తొందర బంగారం గానూ వేస్తున్నానమ్మా తల్లీ...



హబ్బో! ఎన్ని కానుకలో..



హారతి అంటే క్లైమాక్సేనా? బాబూ!




హారతి పట్టిన వాళ్ళకు డబ్బులు ఇవ్వండి మరి.. లేవాలి కదా



హమ్మయ్యా! జేజ నాయనమ్మ కోరిక తీర్చాను.. హాపీ నా..

Monday, June 14, 2010

టేకుమళ్ళ హనుమాయమ్మ గారికి కనకాభిషేకం.


ఈ పోస్టింగ్ ద్వారా మన బంధుమిత్రులందరికీ తెలియజేయడమేమనగా...

టేకుమళ్ళ హనుమాయమ్మ గారికి 20 వ తేదీ, జూన్ నెల ఆదివారం ఉదయం 9.30 గంటలకు నెల్లూరు లో,ఏ.సి.నగరు నందు, సుమ అవెన్యూ అపార్ట్మెంట్సు, గ్రవుండ్ ఫ్లోర్, నందు, ఆమె ముది మనుమడు టేకుమళ్ళ చంద్రహాస్ చక్రవర్తి చే "కనకాభిషేకము" జరుపబడును.

అందువల్ల తామెల్లరూ విచ్చేసి ఆ కార్యక్రమమును తిలకించి మమ్మనందింప జేయ గోరుతున్నాము.

ఆర్.యెస్.వీ.పీ. 9490400858.

Friday, May 28, 2010

అన్నమయ్య అఖండ సంకీర్తనార్చన



అన్నమయ్య అఖండ సంకీర్తనార్చన మే నెల 24 వ తేదీ నుండి 27 వరకూ, అమెరికా వారి సిలికాన్ ఆంధ్రా వారి అధ్వర్యాన విజయవాడ లొ జరిగింది. ఆ సంకీర్తనార్చన లో శ్రీమతి చిదంబరి మరియూ 35 మంది బృందం, 26 వ తేదీ, విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం లో గానం చేసారు.

Thursday, May 27, 2010

బుద్ధ జయంతి 27.05.2010 గురు వారం.




బుద్ధుడు
తండ్రి పేరు : శుద్దోదనుడు
తల్లి పేరు : మాయాదేవి
పుట్టిన తేది : క్రీ.పూ. 563
పుట్టిన ప్రదేశం : లుంబినీ వనం
చదివిన ప్రదేశం : (తెలియదు).

చదువు : క్షత్రియ విద్య
గొప్పదనం : ధర్మ ప్రవర్తన, అహింసావిధానం, జన్మరహస్యం ఎలా పొందుతారో తెలిపాడు.
స్వర్గస్తుడైన తేది : ఈశాన శతాబ్దం 148 వ సంవత్సరం
హిమాలయ శ్రేణికి దిగువన, మగధకు వాయువ్యాన ఉన్న భూప్రాంతానికి శాక్య వంశజుడైన శుద్దోదనుడు రాజు. కపిలవస్తు అతనికి రాజధాని. అతని భార్య మాయాదేవి. ఆ పుణ్య దంపతుల కడుపు పంటగా అవతరించాడు, కరుణామూర్తి బుద్దుడు. అది జరిగింది క్రీ.పూ. 563 ప్రాంతంలో ఒకసారి కపిలవస్తులో పూర్ణిమోత్సవం జరిగింది. పూర్ణిమకు ఏడురోజులు ముందుగా మాయాదేవి ఆ ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, అతి వైభవంగా జరిపింది. ఏడవరోజున పన్నీట పరిమళ స్నానం చేసి ఆమె నాలుగు లక్షల దీనారాలను దానం చేసింది. తరువాత అలంకార భూషితయై, మృష్టాన్నం వచ్చింది. ప్రభపాల బోధిసత్వుడు తెల్ల ఏనుగు రూపంలో ఆమె గర్భంలో ప్రవేశించినట్లు ఆ యిల్లాలు కలగని లేచింది. శుద్దోదనుడు తన రాణి స్వప్న వృత్తాంతం విని బ్రాహ్మణులను పిలిపించి స్వప్న ఫలం అడిగినాడు. అప్పుడు వారు రాజా! మీరేమీ ఆందోళన పడనక్కరలేదు. రాణి గర్భం ధరించింది. మీకు అచిరకాలంలో పుత్రోదయం కలుగనున్నది. అతడు గృహస్తుగానే ఉంటే ప్రపంచానికంతటికి ప్రభువవుతాడు. గృహ పరిత్యాగం చేసి పరివ్రాజక ధర్మం చేపట్టి అజ్ఞాన యవనిక చేధించి పరిపూర్ణ బుద్దుడవుతాడు అన్నారు.

తొమ్మిదినెలలు గడచిన పిమ్మట పదవ నెలలో మాయాదేవి తన పుట్టింకి వెళతానంది. రాజు అందుకు ఆమోదించి కపిలవస్తు నుండి "దేవదేహ" వరకు మార్గాన్ని చక్క చేయించి బంగారు పల్లకీలో పరివార సమేతంగా పంపినాడు. మార్గమధ్యంలో ఉన్న లుంబినీ వనంలో మాయాదేవి కొంత విశ్రాంతి తీసుకోదలచి అక్కడే వున్న ఒక సాలవృక్షం వద్దకు వెళ్ళి దాని కొమ్మనొక దానిని చేతపట్టుకొని నిలబడగానే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయినవి. ఇంతలో నిలబడి ఉండగానే ఆమె పురుష శిశువును ప్రసవించింది. ఆ శిశువు ధర్మబోధన చేస్తున్న ప్రవక్తవలె కరచరణాలను ముందుకు చాచి సోపానపరంపరను అవరోహిస్తున్న వ్యక్తివలే జన్మించాడు. జన్మించగానే లేచి ఏడడుగుల దూరం నడిచి జనన మరణాలవల్ల లోకంలో సంభవిస్తున్న దు:ఖాన్ని నిర్మూలం చేస్తాను అన్నాడట. అప్పుడు ఆకాశములో ఒక దివ్యజ్యోతి వెలిగిందనీ, చెవిటివారికి మాటలు వినబడినాయనీ, మూగవారు మాటలాడగలిగారనీ, కుంటివారు నడిచారనీ చెబుతారు. శుద్దోదనుడు తన కుమారునికి సిద్దార్ధుడని నామకరణం చేసి అల్లారుముద్దుగా అతిగారాబంగా పెంచాడు.

మాయాదేవి అతడు జన్మించిన ఏడవనాడే ఆ ఆనందం తట్టుకోలేక పరమపదించింది. అప్పటి నుండి శుద్దోదనుడి రెండవ భార్య గౌతమి కడుపులో పెట్టుకొని కాపాడింది గౌతముణ్ణి. మహారాజు అతనిని బయటకు ఎక్కడికీ పోనివ్వకుండా రాజప్రసాదంలోనే ఉంచి అతనికి వినోదం కల్పించే నిమిత్తం నలభైవేలమంది నటులను నియమించారు. పరిణత వయస్కుడు కాగానే తన దేశంలోని అయిదు వందల మంది క్షత్రియ రాజకన్యలను రప్పించి వారిలో తనకు నచ్చిన కన్యను వివాహమాడవలసిందని కోరాడు. అప్పుడు సిద్దార్ధుడు మహమంత్రి మహనాముని కుమార్తె యశోధరను వరించాడు. మహానాముడు శాక్యధర్మ ప్రకారం వీరవిక్రమ విహారంలో సర్వరాజకుమారులను జయించిన వానికే తన కుమార్తెనీయ సంకల్పించినానని చెప్పగా సిద్దార్ధుడు వివిధ క్షత్రియ విద్యలలో తనకు గల కౌశల్యాన్ని ప్రదర్శించి యశోధరను చేపట్టినాడు. వివాహితుడై గృహస్త్య జీవితంలోని మాధుర్యం అనుభవించిన కొన్నాళ్ళకి అతనికి రాహులుడని ఒక కుమారుడు కూడా కలిగాడు.

ఒకరోజు అతడు వాహ్యాళికై రాజమందిరం నుండి వెలుపలికి వచ్చి ఒక వృద్దుని చూశాడు. మరొకరోజున ఒకరోగిని, ఇంకొకరోజున ఒక మృతకళేబరమునూ చూశాడు. తనకు కూడా ముసలితనం వస్తుందనీ, తాను కూడా రోగి కావచ్చనీ, తానుకూడా ఒక నాటికి చనిపోతాడనీ తెలియగానే గౌతమునికి యౌవన సుఖాలపట్ల విముఖం ఏర్పడింది. అంతకు ముందుండిన వ్యామోహం తొలగింది. లోకంలోని ఈ అన్మత దు:ఖానికి కారణం ఏమిటి? అది తొలగడం ఎలా? జనన మరణాల రహస్యం ఏమిటి? అని తెలుసుకోవటానికి అతని హృదయం అర్రులు చాచింది. ఆ రాత్రే అతడొక నిశ్చయానికి వచ్చాడు. తన అర్ధాంగినీ అనుంగుపుత్రుని విడనాడి అర్ధరాత్రిలో అతడు అంతఃపురం విడిచి అడవులకు బయలుదేరాడు. తానెక్కివచ్చిన కంటకాశ్వాన్ని చన్నుని ఆధీనం చేసి అతడిని వెనక్కుపంపి కాషాయవస్త్రాలు ధరించి పరివ్రాజకవృత్తి నవలంబించాడు. ఇదే బుద్దుడి జీవితంలోని "మహభినిష్క్రమణం".

తనతో బాటు కృచ్రవ్రతాలు చేసిన అయిదుగురు ఋషులకూ, మొదటగా ధర్మబోధ చేయ సంకల్పించుకొని అతడు మృగదావంలో తపస్సు చేసుకుంటున్న వారి వద్దకు వెళ్ళి వారికి ధర్మోపదేశం చేశాడు. చతురార్య ముగ్దులైన వారికే తెలియక వారు అతనికి ఆర్ఘ్యపాద్యా లిచ్చి ఆదరించారు. ఇదే అతని "ధర్మచక్ర పరివర్తనం". మృగదావంలోనే అతనికి నలభైమంది శిష్యులేర్పడినారు. వారితో తొలి బౌద్ధసంఘం నిర్మించి అతడు బౌద్ద ధర్మ ప్రచార సంకలనంతో ముందుకు సాగి మగధకు వచ్చి అక్కడ బింబిసారునికి బౌద్ద దీక్ష ప్రవచించినాడు. బింబిసారుడు రాజగృహ ప్రాంతంలో బౌద్దబిక్షువుల నివాసం కొరకై రమణీయమైన గొప్ప విహారం ఒకటి కట్టించి యిచ్చినాడు. మహారాజులు, సార్వభౌములు, సామంతులెందరో ఆనాడు బౌద్ధ ధర్మదీక్ష నవలంభించాడు. యశోధర లౌకికవాసన విడనాడి అతని పాదాల నాశ్రయించింది. సంఘంలో తన్ను కూడా చేర్చుకోవాలని ప్రార్ధించింది. తన సంఘంలో స్త్రీలను చేర్చరాదని బుద్దుడు మొదట అనుకున్నా ఆనందుడు మొదలయిన శిష్యుల నిర్భందం వల్ల అతడు వాళ్ళను చేర్చుకోక తప్పిందికాదు. ఈ విధంగా నలభై అయిదు సంవత్సరాల పాటు బౌద్ధ ధర్మప్రచారం చేస్తూ బుద్దభగవానుడు ఎనభై సంవత్సరాలు నిండి బ్రతుకు బ్రతికి తుదకు కుసీ నగరంలో ఈశాన శతాబ్దం 148 వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ మంగళవారం నాడు మహపరి నిర్వాణం చెందాడు.


ఆంధ్ర బుద్ధక్షేత్రాలు

శిశుపాలఘడము, నాగార్జునకొండ, సాలెహుండము, శ్రీకాకుళం హైస్కూల్ దిబ్బ, నరసన్న పేట, అమరావతి, నాగార్జునకొండ, జగ్గయపేట, గోలి, ఘంటసాల, గుడివాడ, భట్టిప్రోలు, గుంటుపల్లి, ఆదుర్రు, శంకారము, రామతీర్థము,

Tuesday, May 4, 2010

సుజన రంజని వారి సమస్యా పూరణ.

మూడవ పూరణ - టి.వెంకటప్పయ్య, సికిందరాబాద్

ఆ.వె.||పెద్దలంత జేరి బెండ్లిని గూర్చగ
కర్మ గాలె నంత కర్ఫ్యు బెట్ట!
నగర జనము లెల్ల నానాక పాట్లురా!
వేళ కాని వేళ వెంకటేశ!



ఆ.వె.|| తాడి చెట్టు నీడ తాగినా పాలను
కల్లు యనదె నిన్ను తల్లి అయిన!
సకలపనులకెల్ల సమయము నెరగుమా!
వేళ కాని వేళ వెంకటేశ!


link: http://siliconandhra.org/nextgen/sujanaranjani/may10/padyamhrudyam.html

Tuesday, April 20, 2010

టేకుమళ్ళ ప్రీతం స్కూలు వార్షికోత్సవం సంబరాలు.






తే! గీ! వివిధ రంగము లందున వీరులమ్ము!
ఎవరు జాలరు మాముందు ఎప్పుడయిన!
కళల చదువుల యన్నిట కకుదమేను!
గొప్ప మాటలు చెప్పము గొంచెమయిన!
(కకుదం అనగా పర్వత శిఖరం అని అర్ధము)

టేకుమళ్ళ వారు గాన, నాటక, నృత్య, కవిత్వ రంగాలలో రాణిస్తున్నారు అనేదానికి మన వద్ద 18 వ శతాబ్దం నుండి అనేక తార్కాణాలు ఉన్నాయి. మళ్ళీ మన తరం లో ఇంకో నటుడు పుట్టాడు. ఎవరా? అని అలోచిస్తున్నారా? వాడే మన ప్రసాద్ కొడుకు చి.ప్రీతం. చిరంజీవి నాట్య విన్యాసలు చూడండి. మనస్ఫూర్తిగ ఆశీస్సులు అందజేయండి.

టేకుమళ్ళ ప్రీతం కు 10 వ జన్మ దిన శుభాకాంక్షలు.





ఏప్రిల్ 13వ తేదీ, టేకుమళ్ళ ప్రసాద్ గారి కుమారుడు చి.ప్రీతం జన్మదినం, మియాపూర్ లో గల వారి స్వగృహం లో వైభవోపేతం గా జరిగింది. హాజరైన వారిలో, టేకుమళ్ళ శ్రీనివాస్ చక్రవర్తి కుటుంబ సభ్యులు, శ్రీమతి బిందు, ఫ్రదోష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే, ప్రీతం నాయనమ్మ లలితాంబ గారు హాజరయ్యారు. బర్తు డే కేకు కట్ చేసిన అనంతరం, అందరు పెద్దలూ, తమ అసీస్సులను అందజేసారు. పిన్నలూ, పెద్దలూ ఈ సందర్భంగా కలుసుకొని, ఆ నాటి సాయంత్రం, ఆనందంగా గడిపారు.

Tuesday, April 13, 2010

అరసికులకు కవిత్వము చెప్పమని అడగొద్దు దేవుడా!!!

శ్లోll
ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన!
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !
కll

చతురాస్యుఁడ! నా నుదురున
అతులిత దుష్కర్మవ్రాయి! హాయిగ వలతున్!
స్తుతియింపగ నరసికుల
మతిమాలియు వ్రాయఁబోకు. మరువకుమయ్యా!
భావము:-
ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా వ్రాయుము. సహిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం వ్రాయకుసుమా! . ముమ్మాటికీ వ్రాయకు.

Friday, April 2, 2010

సుజనరంజని ఈ మాగజైను.

సుజనరంజని చాల మంచి ఈ మాగజైను.
చదవండి.

అన్నట్టు ఈ మాసపు మాగజైను లో నా సమస్యాపూరణ పడింది. చూడండి.
టి.వెంకటప్పయ్య, సికిందరాబాద్

తే!గీ!!ఘోష యాత్ర నందు ఘోరావమానమై
తపము జేసి పొందె తాను వరము
కుంతి సుతులనెల్ల కుహకంబు జేసెగా!
మనిషి చచ్చె కాని మదము మిగిలె!
(కుహకము అనగా మోసము అని అర్ధము)
link: http://siliconandhra.org/nextgen/sujanaranjani/apr10/padyamhrudyam.html

Wednesday, March 24, 2010

టేకుమళ్ళ గ్రామం చూసారా?



"టేకుమట్ల" అనే వూరు నల్గొండ జిల్లా లో (హైదరాబాదు - విజయవాడ రోడ్డు మార్గం లో) ఉంది. అదే కాలక్రమేణా "టేకుమళ్ళ" గా మారి ఉండ వచ్చు. అదే, టేకుమళ్ళ వారి పూర్వీకుల జన్మ స్తలం గా భావించడం జరుగుతోంది.పై చిత్రం లో టేకుమళ్ళ అనే గ్రామం బోర్డు చూడవచ్చు

Tuesday, March 23, 2010

టేకుమళ్ళ వెంకట శేషయ్య 61 వ జన్మదినోత్సవము




19 వ తేదీ మార్చి నెల 2010 టేకుమళ్ళ వెంకట శేషయ్య గారి జన్మ దినోత్సవము వారి స్వగృహం లో ఘనం గా జరిగింది.

తే!గీ! టేకుమళ్ళకు వెలుగాయె టంకణముగ!
జన్మ సఫలత జెందెను జగతి నందు!
దేవ దేవుడ గాయుము దయను జూపి!
ఆయురారోగ్య ఐశ్వర్య మానతిమ్ము.



వారి కుటుంబ సభ్యుల సమక్షం లో జన్మదినోత్సవం వైభవోపేతం గా జరిగింది. భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను.

Saturday, March 20, 2010

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు





శ్రీ రామ రామ రామేతి, రమె రామె మనోరమె
సహస్ర నామ తత్తుల్యం, రామ నామ వరాననె

అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమి అనగానే గుళ్ళలో పందిళ్ళు, వడపప్పు పానకాలు, సీతారామ కళ్యాణం, ముఖ్యంగా ఊళ్ళల్లో ఐతే పండగ అనే కంటే ఒక పెళ్లి వాతావరణం ఉంటుంది. పెళ్లన్నా, పెళ్లి హడావుడి అన్నా ఇష్టం లేని వాళ్ళెవరు? బహుశా అందుకేనేమో నాకు శ్రీ రామ నవమి అంటే పండగలలో ప్రత్యేకమయిన ఇష్టం. శ్రీ రాముడు మన దేవుడన్న విషయం పక్కన పెట్టినా, రాముడు ఆదర్శ పురుషుడికి ప్రతిరూపం. రామాయణం - మనిషి ఎలా బతికితే మనిషి అనిపించుకున్టాడో చెప్పే ఒక గైడ్. సమాజం సవ్యంగా నడవడానికి ఒక మార్గం. దానిలోని సారాన్ని గ్రహించి ప్రస్తుత పరిస్థితులకి అన్వయించి వాడుకుంటే రామాయణ పరమార్థం అవపోసన పట్టినట్టే అని నా ఉద్దేశ్యం.


సీతారాముల శుభ చరితం రస భరితం ఇది నిరితం
కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం

భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము.
ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము . ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్ధనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రదమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమ శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. ఒక్కమారు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.




శ్రీ రాముని ప్రసక్తి వస్తే, శ్రీ రామదాసు (కంచెర్ల గోపన్న) ప్రసక్తి అనివార్యం.

భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కదంబ దంపతులకు జన్మించినాడు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కధ యున్నది)

గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లబించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.

అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని స్వతహాగా హరి భక్తులైన గోపన్న సంకల్పించాడు. అందుకు విరాళములు సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.(ఈ విషయములో అనేకమైన కధలున్నాయి.) కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.



హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.


ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను.

ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. హనుమంతుని స్మరించినయెడల సీతారాములు ప్రసన్నులగుదురు. హనుమంతుని పేరు వినబడినచోట దయ్యములు ఉండలేవు. సుందరకాండ చదివితే కార్యములు సిద్ధించును. సకల వాంఛితార్థములకు హనుమంతుని ప్రార్థింపవచ్చును. మోక్షమునకు తప్ప మిగిలిన కోరికల కొరకు శ్రీరాముని నేరుగా భజింపవలదు.

అందుకే అనుకుంటా ఎన్ని రామాయణాలు వచ్చినా, రామాయణం లోంచి ఎన్ని కథలు వచ్చినా అతి మధురంగా ఉంటాయి. ఎన్ని సార్లు చూసినా విన్నా తరగని సుధలా మనసుకు విందు చేస్తుంటాయి. త్యాగయ్య జగదానంద కారకా అన్నా, బ్రోచేవారెవరురా అన్నా - రామదాసు అంతా రామమయమన్నా మది పులకిస్తుంది. భక్తితో ఆనంద తాండవం చేస్తుంది. రామగానామృతం లో ఆర్తిగా తడుస్తుంది.

Wednesday, March 17, 2010

ఉగాది ప్రాముఖ్యం



16 మార్ఛి 2010 విక్రుతి నామ సంవత్సరం ఆరంభము

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.
ఉగాది ప్రాముఖ్యం

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. [1]. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.

"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.



సంప్రదాయాలు
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు

తైలాభ్యంగనం
నూతన సంవత్సరాది స్తోత్రం
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.[2]

పూజాదులు
అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి"ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తిని పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటాఱు.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు,ఆ చారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.

ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరిక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం. [3]

ఉగాది ప్రసాదం
ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.ఉగాదితో వేసవి ఆంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్నా సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది.ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

పంచాంగ శ్రవణం
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.

నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.
ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

Wednesday, March 10, 2010

శ్రీమతి టేకుమళ్ళ (పులిగండ్ల) చిదంబరి కి గిన్నీస్ బుక్ వారి ప్రశంసా పత్రం.




శ్రీ అన్నమాచార్య 601 జయంతి సంధర్భంగా, 10 మే నెల 2009 నాడు సికిందరాబాదు పరేడ్ గ్రవుండ్స్ లో "లక్ష గళార్చన" జరిగింది. దానిలో పాల్గొని సాంప్రదాయ బద్ధంగా అన్నమాచార్య కీర్తనలు గానం చేసినందుకు గాను, "గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్" వారు శ్రీమతి చిదంబరి కి ప్రశంశా పత్రం ప్రదానం చేసారు.

Monday, March 8, 2010

శ్రీమతి టేకుమళ్ళ (పులిగండ్ల)చిదంబరి కి "భారత మహిళా శిరోమణి" అవార్డు


సన్మాన కర్యక్రమం లో..పి.వి.రంగారావు, రోడ్లు భవనాల శాఖా మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి, సన్మానితురాలు శ్రీ మతి చిదంబరి, ఎన్.టీ.ఆర్.విజ్ఞాన్ ట్రస్ట్ అద్యక్షురాలు లక్ష్మీ పార్వతి, టీ.వీ. యాంకర్ శ్రీమతి ప్రీతీ నిగం.


శ్రీమతి లక్ష్మీ పార్వతి తో ముచ్చట్లు.




శ్రీమతి పి.చిదంబరి, శ్రీ పి.ఎస్.విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ హై స్కూల్లో సైన్సు, ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నారు. సంగీతంలో గాత్రం లో డిప్లొమా చేసి పలు సంగీత కచ్చేరీలు ఇచారు. ఎమ్మెస్సీ, ఎం.ఈడీ చదివారు. తరగతి లో వెనుక బడిన విద్యార్ధులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించడం, సంగీతం క్లాసులు నిర్వహించి వారికి సంగీతం లో అభినివేశం కల్పించడం.సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లలకు ఎప్పటికప్పుడు తాజా సైన్సు సమాచారం అందించడం. ఎయిడ్స్, పల్సు పోలియొ వంటి కర్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం. సైన్సు ఫేర్లు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమర్ధవంతం గా నిర్వహించారు.
వీరి సంతానం ఐ.ఐ.టి., కంపెనీ సెక్రటరీ వంటి ఉన్నత విద్యాభ్యాసం చేయడం లో వీరి పాత్ర ఎంతో ఉంది. ఒక అదర్శ తల్లిగా, గాయకురాలిగా, టీచరుగా, సంఘ సేవా తత్పరురాలిగా, బహుముఖ పాత్రలు సమర్ధవంతం గా పోషిస్తున్నందుకు, హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వారు మార్చి 8వ తేదీ సాయంత్రం 7 గంటలకు "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" ను పురస్కరించుకొని హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో శ్రీమతి చిదంబరి కి "భారత మహిళా శిరోమణి" అవార్డు ప్రదానం చేసారు. విజయవాడ నగరానికి ఈమె ఒక్కతే ఎంపిక కావడం గమనించ దగ్గ విశేషం.

Wednesday, February 24, 2010

హోళీ ప్రాముఖ్యత



రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రము"లచే చావు లేకుండా వరాన్ని పొందాడు. కాబట్టి, అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు.

దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి మరియు సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) మరియు తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రా లు, శస్త్రా లచే కాకుండా).


ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథురా మరియు వృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన కుచేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క (శక్తి లేదా ప్రపంచాన్ని నడిపే బలం) శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.


హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది.పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగ పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు.కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.


హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ (తేజ). ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. ఈ పండుగను చాలా రోజుల ముందుగానే 'హోలీ మిలన్' లేదా బైతక్స్ ద్వారా జరుపుకొన్నారు, సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు.

Monday, February 15, 2010

ముది మనుమడి తో హనుమాయమ్మ గారు!




కొడుకు వెంకటప్పయ్య, మనుమడు రాహుల్ చక్రవర్తి, ముది మనుమడు
చి.చంద్రహాస్ చక్రవర్తి తో హనుమాయమ్మ గారు శనివారం 13.02.2010
న నెల్లూరు లో అనందంగా గడిపారు.

Wednesday, February 10, 2010

శివరాత్రి విశిష్టత


మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి.

శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం.

మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. ఆ కధ – "ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం ఆ చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట అన్నార్తుడై ఒక వ్యక్తి రాగా, దయ కలిగినవాడై, ముందు అతడికి ఇచ్చి తర్వాత తను తిన్నాడు.

ఆ వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తను సేవించాడు.

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!”
ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు.

Saturday, January 30, 2010

ఫిబ్రవరి నెల కు స్వాగతం


ఫిబ్రవరి నెల కు స్వాగతం!!!

Tuesday, January 26, 2010

గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు!!!!



మన వెబ్ సందర్శకులకు నా గణతంత్ర దిన శుభాభినందనలు!

తే!గీ! తగవు లాటలు మానండి తగవు! మీకు!
పూజ్య బాపూజి మాటలు పూజ్యమేన?
ఆంధ్ర యన్నది అందరి ఆశ గాదె!
కలిసి ఉండిన కలుగును కలిమి మీకె!

నేను సమైక్య వాదిని కాదు. అలా అని ప్రత్యేక వాదినీ కాను.
కుమ్ములాటలు మాత్రం తగవు అని చెప్తున్నాను.
కలిసి వుంటె కలదు సుఖం!

ఈ మాట కేవలం అంధ్రా తెలంగాణాకోసం చెప్పడం లేదు. మన కుటుంబానికైనా
ఇదే సూక్తి వర్తిస్తుంది కదా! అలోచించండి!!!

సదా మీ అభిమానం కోసం ఎదురు చూసే....

మీ

టేకుమళ్ళ వెంకటప్పయ్య.
26-01-2010.

Wednesday, January 20, 2010

టేకుమళ్ళ వంశస్తులకు ఒక శుభ వార్త.

నేను గతం లో చెప్పిన విధంగా మనం గర్వించదగ్గ మన వంశస్తుడుశ్రీ టేకుమళ్ళ రంగ శాయి కవి 1632 సం.లో రచించిన "వాణీ విలాస వనమాలిక అనే గ్రంధాన్ని అతి కష్తం మీద జెర్మనీ లో ఉన్న శ్రీ పరుచూరి శ్రీనివాస్ అనే ఒక మహానుభావుడి దయ వలన సంపాదించ గలిగాననిచెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను.
నా సంతోషం కొద్దీ ఆ పుస్తకం లోని మొదటి పేజీ ని పైన ఉంచుతున్నాను. చూడండి
మన టేకుమళ్ళ వంశజుడు, నెల్లూరు నివాసి, సాధించిన ఘన విజయాలు చూసి ఆనందిస్తారని ఆశిస్తాను. ఎవరైనా పై పుస్తకం చదవాలని అనుకుంటే నాకు తెలియ జేయండి. శెలవు....టేకుమళ్ళ వెంకటప్పయ్య.

Wednesday, January 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు







మన బంధు కోటికీ, మిత్రులకూ సంక్రాంతి శుభాకాంక్షలు!





తే గీ పిల్ల పాపల తోడుగ చల్ల గాను!
ఆయు రారోగ్య ఐశ్వర్య దాయు లవగ!
దేవు డిచ్చును మీకిల దేయ మనఘ!
సకల శుభముల నిచ్చుమ సంకు రాత్రి !
మీ మీ అనుభవాలు సంతోషాలు, బ్లాగు లో "వ్యాఖ్య" ల రూపం లో తెలియజేయండి. మీ ఫోటోలు, విశేషాలు పంపండి. ఈ మెయిల్ పంపండి.